in

Samantha shifts focus from commercial films to challenging roles!

రొటీన్ సినిమాలకు నో చెప్పిన సమంత
సిటాడెల్‌ ప్రమోషన్స్ లో భాగంగా వీడియో చాట్ చేస్తున్న సామ్ ని ఒక నెటిజన్‌ ‘మీరు గతంలోలా కమర్షియల్‌ సినిమాలు చేయటం లేదు ఎందుకు అని అడిగాడు. దీనికి సామ్ స్పందిస్తూ ఇకపై తాను అలాంటి సినిమాలు చేయను అని రిప్లై ఇచ్చింది. రెగ్యులర్‌ కథలు,  కమర్షియల్‌ సినిమాలు, హీరో వెంట పడే పాత్రలు, ఓ రెండు సీన్స్, మూడు పాటలు ఉన్న సినిమాలు చేయనని, నటిగా సంతృప్తి ఇచ్చే పాత్రలే చేస్తానని, నాకు ఆ పాత్ర చాలింజింగ్ గా ఉండాలని పేర్కొంది.

ఇక పై లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న సమంత?
అందుకే వచ్చిన ప్రతి కథ ఒప్పుకోవటం లేదని, తనకి నచ్చిన పాత్ర కోసం చూస్తున్నా అని తెలిపింది. అంటే సామ్ ఇక నుంచి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తుందని తెలుస్తోంది. ఇంచు మించు నయనతార రూట్లో వెళ్తోంది. కానీ నయన తార అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తోంది. కానీ సామ్ వాటికీ నో చెప్పేసింది.  ఐటెం సాంగ్స్ కూడా చేయను అని తెగేసి చెప్పేసింది. సామ్ నిర్ణయం మంచిదే కానీ ఇలా గిరి గీసుకుని కూర్చుంటే ఛాన్స్ లు తగ్గిపోతాయని, స్టార్ హీరోల సినిమాల్లో నటించకుండా పోతుంది అని ఆమె ఫాన్స్ వాపోతున్నారు..!!

‘Pushpa 2 – The Rule’ creates huge USA Premiere Sales of record!

Sreeleela to feature in special song for Allu Arjun’s ‘Pushpa 2!