in

Samantha Reveals How Steroid Ruined Her Skin and face!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమానే ఖుషి కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ నే అందుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా లాభాలు అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా అనంతరం సమంత నుంచి భారీ సిరీస్ “సిటాడెల్” ఇంకా రావాల్సి ఉంది. అయితే వీటిని కంప్లీట్ చేసిన తర్వాత సమంత పెద్ద బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం సమంత గత కొన్నాళ్ల నుంచి మాయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడడం అనే తెలిసిందే. కాగా సమంత దీని చికిత్స కోసమే గ్యాప్ తీసుకోగా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ లోనే బిజీగా ఉంది.

మరి ఈ మధ్యలో ఆమె తాజాగా కొన్ని ఊహించని అంశాలు రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది. సమంత తాను చికిత్స కోసం స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చేది అని ఇలా వాటిని పలుమార్లు తీసుకోవడం మూలాన అయితే నా చర్మం అంతా కూడా పాడైపోయింది అని చెప్పింది. ముఖ్యంగా తన ముఖంలో కూడా చాలా మార్పులు వచ్చినట్టుగా తాను గమనించాను అని ఆమె చెప్పింది. అంతే కాకుండా తాను చాలా కష్టాలు పడ్డాను అని టీన్ ఏజ్ అమ్మాయిలు తమ లైఫ్ పరంగా ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె సూచించింది. దీనితో సమంత లేటెస్ట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి..!!

allu arjun to team up with boyapati again!

Deepika worked in Jawan without remuneration for srk!