in

samantha is my inspiration : upasana

గత కొన్నాళ్ల నుంచి మెగా కోడలు ఉపాసన కొణిదెల మరియు అక్కినేని కోడలు సమంతా అక్కినేనిలు సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత చక్కటి హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తోంది. ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసింది. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్ గా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని ఎంచుకుంది. తను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది.ఉపాసన, సమంత వంట చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ఉపాసన మాట్లాడుతూ సమంత తనకు ఇన్సిపిరేషన్ అన్నారు.

double dhamaka for prabhas fans!

rajamouli good news to ntr fans!