శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి.. ఆమె నుంచి ఓ చిత్రం వస్తుందంటే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉంటున్నాయి.. అయితే త్వరలోనే సాయి పల్లవి తెలుగులో ఓ పూర్తిస్థాయి మహిళా ప్రధాన్యత ఉన్న చిత్రంలో నటిస్తుందని తెలుస్తోంది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని సమాచారం.. ఇప్పటికే సాయి పల్లవికి కథను వినిపించగా ఆమె కూడా కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.
దీనిపైన త్వరలో ఓ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి.. ఈ సినిమా తర్వాత అనిల్ ఎఫ్2 కి సీక్వెల్ చేయాల్సి ఉంది. అయితే వెంకటేష్, వరుణ్ తేజ్ తమతమ సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఆలస్యం కానుంది.. ఈ క్రమంలో చిన్న బడ్జెట్ తో ఓ కథను చేయాలనీ అనుకున్న అనిల్ రావిపూడి… సాయి పల్లవితో ఓ సినిమాని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది..