in

ANCHOR ANASUYA TO PLAY DEVADASI ROLE!

బుల్లితెరపై హుషారైన వ్యాఖ్యాతగా గుర్తింపును సంపాదించుకుంది అనసూయ. సినిమాల్లో సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకొని రాణిస్తోందామె. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా అనసూయ పాత్ర అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సీనియర్‌ దర్శకుడు కృష్ణవంశీ నిర్ధేశకత్వంలో రూపొందించబోతున్న ‘రంగమార్తండ’ చిత్రంలో అనసూయ ఓ పాత్రలో నటించబోతున్నది. ఆమె పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. పాత్ర చిత్రణ పట్ల ప్రత్యేకశ్రద్ధతీసుకునే కృష్ణవంశీ ‘రంగమార్తండ’లో అనసూయను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసి పాత్రలో కనిపించనుందని సమాచారం. అందం, అభినయం, భావోద్వేగాలు కలబోతగా ఆమె పాత్ర సాగుతుందని అంటున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’ ఆధారంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించనున్నార..

sai pallavi’s next with anil ravipudi?

rana in shobhan babu biopic?