in

sai pallavi turns into a choreographer!

ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగులోకి వచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మళ్ళీ ఆయనే దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో నటిస్తుంది. నాగ చైతన్య హీరోగా కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా  నిలిచిపోయింది. ఇందులోని కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటుగా ఓ పాట కూడా షూట్ చేయాల్సి ఉందట. అయితే సాయి పల్లవి ఎంత మంచి డ్యాన్సరో అందరికి తెలుసు. ఫిదా అలాగే మారి 2 సినిమాలో తాను చేసిన డాన్స్ తో  ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుంది. అందువల్ల  శేఖర్ కమ్ముల తన సినిమాలో మిగిలి ఉన్న ఆ ఒక పాటను కొరియోగ్రఫీ చేయమని పల్లవికి చెప్పాడట! ఇక డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న తాను కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఓకే చెప్పేసిందట! అంటే ఈ సినిమాలో నాగ చైతన్య తో సాయి పల్లవి చిందులేయించనుందన్న మాట.

‘power star’ trailer is not free to watch!

rakul to play a prostitute character!