in

rakul to play a prostitute character!

టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన నటించిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.కొత్త అమ్మాయిల దూకుడుతో రకుల్ కాస్త వెనుకపడింది. ప్రస్తుతం తమిళంలో ‘భారతీయుడు 2’లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.అంతగా ఆఫర్లు లేక సతమతమవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న తాజా ప్రయోగం చూస్తే షాక్ తినాల్సిందే. వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధమైంది ఈ కుర్రది.

ఇప్పటికే బాలీవుడ్ లో `మర్జవాన్` సినిమాలో మోడ్రన్ వేశ్య పాత్రలో నటించి తన హాట్ హాట్ అందాలతో హిందీ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి రకుల్ ప్రయత్నించింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రే రకుల్ కు దక్కడం విశేషం.ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన యువతిగా ఇందులో ఆమె కనిపిస్తుంది. ఆ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్య నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. అందులో నటించేందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

sai pallavi turns into a choreographer!

star anchors not ready for shootings!