in

Sai Pallavi reveals Beaten Up Hard For Writing A Love Letter!

సాయిపల్లవి.. ఆ అందాన్ని చూసిన వెంటనే ప్రేమించేయాలని అనిపిస్తుంది. మన పక్కింట్లో ఇలాంటి పిల్ల ఉంటే బాగుండేదనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. మరి సాయిపల్లవికి అలా అనిపించే సందర్భం ఉందా?.. ఉందంటోంది ఈ రేర్ పీస్. తను చిన్న వయసులో ఉన్నప్పుడే ఓ అబ్బాయికి ప్రేమలేఖ రాశానని చెప్పుకొచ్చింది. “నేను ఒక అబ్బాయికి లేఖ రాశాను, అది నా చిన్నతనంలో జరిగింది. అప్పుడు నేను బహుశా 7వ తరగతి చదువుతున్నాను. ఆ టైమ్ లో ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. కానీ.. నా బ్యాడ్ లక్. ఆ లెటర్ మా తల్లిదండ్రుల కంటబడింది. వాళ్లకు దొరికిపోయాను. అమ్మ-నాన్న నన్ను గట్టిగా కొట్టారు.”

ఇలా తన చిన్నప్పటి ప్రేమ సంగతుల్ని గుర్తు చేసుకుంది సాయిపల్లవి. ఆమె నటించిన గార్గి సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టింది సాయిపల్లవి. గౌతం రామచంద్రన్ రచన-దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఉపాధ్యాయురాలిగా నటించింది..ఈ ఏడాది ఆల్రెడీ విరాటపర్వంలో థియేటర్లలోకి వచ్చింది సాయిపల్లవి. కానీ.. అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఓటీటీలో కూడా పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు గార్గితో మరోసారి ప్రేక్షకులముందుకొస్తోంది. విరాటపర్వంలో సాయిపల్లవితో కలిసి నటించిన రానా, ఈ గార్గి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.

RAJAMOULI WIND UP CHEYALI ANUKUNNA CINEMA!

The Warriorr!