in

‘PELLI SANDADI’ BEAUTY TO PLAY A CRUCIAL ROLE IN MAHESH BABU’S FLICK!

కృతి శెట్టి తరువాత టాలీవుడ్ కి పరిచయమైన అందాల కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీలనే. ఈ కన్నడ బ్యూటీ  ముందుగా కన్నడ సినిమాలతోనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్  పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది..ఆ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాలోనూ అవకాశాన్ని సంపాదించుకుంది.

ఇక త్రివిక్రమ్ – మహేశ్ బాబు సినిమాలో ఒక కథానాయిక పూజ హెగ్డే కాగా, మరో హీరోయిన్ గా శ్రీలీలను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి..ఈ సినిమాలో ఆమె మహేశ్ బాబు మరదలి పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 2వ వారంలో సెట్స్ పైకి వెళుతోంది. త్రివిక్రమ్ – మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అందరిలో ఆసక్తి పెరుగుతూపోతోంది.

Deverakonda responds to Sara Ali Khan’s comments about dating him!

RAJAMOULI WIND UP CHEYALI ANUKUNNA CINEMA!