in

Adivi Sesh join hands with Rahul Ravindran!

adivi sesh join hands with rahul ravindran!

టాలీవుడ్‌లో కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే హీరోల్లో అడివి శేష్ ఒకరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త తరహా కథలు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయనకు అలవాటు. ముఖ్యంగా శేష్ నటించే చిత్రాల్లో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆయన నుంచి కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల 'డెకాయిట్: ఎ లవ్ స్టోరీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్, ఇప్పుడు తన తదుపరి చిత్రమైన 'గూఢచారి 2' పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'గూఢచారి'కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి రాకతో ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు దాదాపు రూ.100 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న 'G2' చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ పనిచేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు అడివి శేష్ మరో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం, 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అడివి శేష్ ఓ కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది..ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, రాహుల్ చెప్పిన స్టోరీ లైన్ శేష్‌కు నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు ఆయన అంగీకారం తెలిపినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ముఖ్యంగా హీరోయిన్ ఎంపికపై దర్శకుడు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కథకు తగిన నటిని ఎంపిక చేసిన వెంటనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరులోనే సినిమా ప్రకటనతో పాటు నిర్మాణ సంస్థ వివరాలు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా కథాంశం, జానర్, ఇతర నటీనటుల విషయంలో ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక అడివి శేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలను గమనిస్తే 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్', 'హిట్: ద సెకండ్ కేస్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రతి ప్రాజెక్టులోనూ వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్‌ తో చేయబోయే సినిమా కూడా అలాంటి కొత్త అనుభూతిని అందిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో చర్చ మొదలవడంతో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

dimple hayathi about her role and bhogi director!

Dimple Hayathi about her role and Bhogi Director!