in

REVIEW OF THE RULER’S ‘RULER’ !

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు దారుణమైన రిజల్ట్‌ రావటంతో అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు.

బాలకృష్ణ, కేయస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం జైసింహాకు యావరేజ్‌ టాక్‌ రావటంతో ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగా బాలయ్య కూడా డిఫరెంట్ లుక్‌లో అభిమానులకు కనువిందు చేసేందుకు రెడీ అయ్యాడు. స్టైలిష్‌ బిజినెస్‌మేన్‌, మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సినిమాలో రెండు వేరియేషన్స్‌ చూపించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ లుక్స్‌పై కూడా డివైడ్‌ టాక్‌ వచ్చింది. అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికీ ప్రీమియర్‌ షోస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మిడ్‌నైట్‌ నుంచే స్పెషల్‌ షోస్‌ పడ్డాయి. డివైడ్‌ టాక్‌తో స్టార్ట్ అయిన రూలర్‌.. నందమూరి అభిమానులను మాత్రం బాగానే ఖుషీ చేస్తోంది. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం రొటీన్‌ మాస్‌ ఫార్ములా సినిమా అంటూ పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపించినా.. సెకండ్‌ హాఫ్‌ పూర్తిగా నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది. ఓవరాాల్‌గా రూలర్‌.. బాలయ్య అభిమానులను మెప్పించినా పూర్తి స్థాయిలో అలరించటం కష్టమే అన్న టాక్‌ వినిపిస్తోంది.

 

రేటింగ్ : 2.5 / 5

jabardasth lady in for balayya’s next!

Prati Roju Pandage