బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి రెజీనా ఎప్పుడూ వెనకాడదు. స్టోరీ డిమాండ్ చేసిందని హగ్గింగ్స్, లిప్ లాకులు కూడా చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఎవరు డిమాండ్ చేసినా నో హగ్స్ అంటోంది. ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే, కథ కావాలని చెప్పిన నేను మాత్రం లిప్ లాక్ చెయ్యనంటోంది రెజీనా. రెజీనా ఎక్కువగా కమర్షియల్ మూవీస్ లోనే నటించింది. కెరీర్ బిగినింగ్ నుంచి ఇలాంటి పాత్రలే చేస్తోంది. మరి సడన్ గా నో హగ్స్, నో లిప్ లాక్స్ అనడానికి కరోనా భయమే కారణమంటున్నారు జనాలు.
కోవిడ్-19 బరినపడకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెపుతున్నారు. అందుకే రెజీనా సినిమాల్లో కూడా నో టచింగ్స్ అంటోంది. రెజీనా తెలుగులో స్లో అయి చాలా కాలమైంది. ‘ఎవరు’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ తో మెప్పించినా ఆ తర్వాత పెద్దగా బిజీ కాలేకపోయింది. దీంతో తమిళ్లో కెరీర్ వెతుక్కుంటోంది. మరి కరోనా కాలంలో నో టచింగ్స్ ఆంటోన్న రెజీనా మళ్లీ తెలుగులో ఎప్పుడు బిజీ అవుతుందో చూడాలి..