in

Varma revealed his apsara!

తాజాగా కొత్త సినిమా హీరోయిన్ ను వర్మ పరిచయం చేశాడు. ఒడిశాకు చెందిన అప్సర రాణి అనే యువతిని తన కొత్త సినిమా హీరోయిన్ గా పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్స్ చేశాడు. శ్రీ రాపాకను హీరోయిన్ గా పరిచయం చేసి ఆమెను ఓవర్ నైట్ లో సెలబ్రెటీని చేసిన వర్మ ఇప్పుడు అప్సర ను హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే ఈమె రెండు తెలుగు సినిమాల్లో నటించింది. కాని ఇండస్ట్రీలో కూడా ఈమె చాలా మందికి తెలియనే తెలియదు. అలాంటి అప్సర వర్మ చేతిలో పడటంతో ఓవర్ నైట్ స్టార్ అవ్వబోతుందంటున్నారు. ఇంకా సినిమాలో నటించకుండానే వర్మ ట్వీట్ తో అప్సర గురించి అందరికి తెలిసి పోయింది. ఆమె గురించి మరింతగా తెలుసుకునేందుకు జనాలు ఉబలాట పడుతున్నారు.

regina shocks her fans!

here is why sam rejected pushpa!