in

regina reveals once she Faked Her Pregnancy to buy a sweet!

రెజీనా కసాండ్రా..ఈ మధ్యనే ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది అన్యాస్ ట్యుటోరియల్ అనే ఒక వెబ్ సిరీస్ తో ఆమె ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఆహాలో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఒక్క రాత్రిలో గర్భవతినయ్యానని కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటి ఒక రాత్రిలో గర్భవతి అవడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే మీరు అనుకున్నట్టు నిజంగా గర్భవతి కాలేదు. అసలు విషయం ఏమిటంటే ఆమెకు మిస్టీ దోయ్ అనే స్వీట్ అంటే చాలా ఇష్టమట.

ఒక అర్ధరాత్రి సమయంలో స్వీట్ షాప్ దగ్గరకు వెళ్లి ఆ స్వీట్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే  అప్పుడే షాప్ యజమాని క్లోజ్ చేస్తూ కనిపించాడట. షాప్ ఓపెన్ చేసి తనకు స్వీట్ ఇవ్వమని అంటే షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం కష్టమని ఆయన చెప్పారట. తాను గర్భవతిని అని అబద్ధం ఆడటంతో గర్భవతికి తినాలనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన అప్పటికప్పుడు షాప్ ఓపెన్ చేసి ఆమెకు కావలసిన స్వీట్ ఇచ్చారట. అలా తను ఒక్క రాత్రిలో గర్భవతిని అయ్యానంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె చేసిన పని మీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె ఇలా చేయడం కరెక్ట్ కాదు అని కొందరు కామెంట్ చేస్తుంటే కావాల్సింది లెక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తారా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

The Warriorr!

1 month, 3 continents, 4 cities: Pooja Hegde’s vacation plan!