in

Ravi Teja has A Strong Lineup Followed By Irumudi!

ప్ర‌స్తుతం ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నారు ర‌వితేజ‌. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌లైంది. తండ్రీ కూతుర్ల అనుబంధం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఈ సినిమాతో మాస్ మ‌హారాజా క‌మ్ బ్యాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ఆశ ప‌డుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నారు..

క‌థ చాలా బాగా వ‌చ్చింద‌ని టాక్. పైగా దిల్ రాజు బ్యాన‌ర్ ఆయె. కాబ‌ట్టి..మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆ త‌ర‌వాత వివేక్ ఆత్రేయ కూడా లైన్ లో ఉన్నాడు. వివేక్ క‌థ‌ల‌న్నీ సెన్సిటీవ్ గా ఉంటాయి. ఫ‌న్ ఉంటుంది. సో..ర‌వితేజ‌ను కొత్త‌గా చూసే అవ‌కాశం ఉంది. త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి..ర‌వితేజ కోసం ఓ క‌థ సిద్ధం చేశార‌ని టాక్‌. హ‌రి అన‌గానే ‘సింగం’ సిరీస్ గుర్తుకు వ‌స్తుంది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డంలో ఆయ‌న దిట్ట‌. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కి, హ‌రి స్టైల్ కీ స‌రిగ్గా స‌రిపోతుంది. కాబ‌ట్టి..కాంబో ప‌రంగా..ఈ ప్రాజెక్ట్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది..!!

happy birthday kajal agarwal!

Maa Inti Bangaaram!