in

‘Irumudi’ Faces Controversy Over Child Actor’s Involvement!

‘Irumudi’ Faces Controversy Over Child Actor’s Involvement!

జైలోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేశ్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఆగస్టులో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో రవితేజ కూతురు మణెమ్మ పాత్రలో బేబీ నక్షత్ర నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమెను తీసుకోవడంలో చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ జారీ చేసిన నోటీసులో పలు కీలక అంశాలపై వివరణ కోరారు. బాలికతో నటింపజేయడానికి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా?

తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం ఉందా? బాలికకు చెల్లించిన పారితోషికంలో 20 శాతం ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? షూటింగ్ పని గంటలు, ఆమె చదువుకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు ఏమిటి? వంటి వివరాలను సమర్పించాలని కోరారు. ఈ అంశాలపై పూర్తి ఆధారాలతో నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో విచారణకు హాజరు కావాలని నిర్మాతలను ఆదేశించారు. స్వయంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ నోటీసులపై మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు..!!

regina cassandra reveals her Breakup and Emotional Betrayal

how did venkatesh missed Romancing Miss World aishwarya rai