in

routine that helps samantha overcome self-doubt and negatives!

మంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎన్నో ఒడుదొడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అయితే తనలో కలిగే ఆత్మన్యూనత భావం, నెగెటివ్‌ ఆలోచనలను ఎలా అధిగమిస్తుందో తాజాగా అభిమానులతో పంచుకున్నారు. గతంలో తన డైలీ మార్నింగ్‌ రొటీన్‌పై ఓ వీడియోను పంచుకున్నానని గుర్తు చేసిన సమంత..అది కేవలం వీడియో కోసం చెప్పింది కాదన్నారు..

ఉదయం ఎండలో కొంతసేపు గడపడం, కృతజ్ఞతా డైరీ రాయడం, ధ్యానం చేయడం, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం వంటి అలవాట్లు తన మనసులోని గందరగోళాన్ని తగ్గించాయని తెలిపింది. ఇవి నెగెటివ్‌ ఆలోచనలను దూరం చేయడంలో ఎంతో సాయపడ్డాయని పేర్కొంది. “ప్రతి ఒక్కరికీ భయాలు ఉంటాయి. ఆత్మన్యూనత కూడా ఉంటుంది. కానీ ఒక క్రమబద్ధమైన రొటీన్‌ను పాటిస్తే వాటిలో చాలా వరకు సహజంగానే తగ్గిపోతాయి. నేను నా అనుభవంతో చెబుతున్నాను” అని సమంత పేర్కొంది..!!

trisha shocks chiranjeevi Vishwambhara makers!

happy birthday kajal agarwal!