in

Rashmika reacts To Aishwarya Rajesh’s Srivalli’s controversy!

పుష్పలో శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్య రాజేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక మందన్న స్పందించింది. ఐశ్వర్య రష్మిక పాత్ర గురించి ప్రస్తావించిన తర్వాత, రష్మిక స్పందిస్తూ ఆమె ఉద్దేశ్యాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకున్నానని చెప్పింది. దానికి ఐశ్వర్య ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే తానే బాగుంటానని ఎప్పుడూ అనుకోలేదని, అలాంటి పాత్ర తనకు సూటవుతుందని మాత్రమే చెప్పానని ఆమె స్పష్టం చేసింది.

తన ప్రకటన తప్పుగా అర్థం చేసుకున్నారని, రష్మిక యాక్టింగ్ అంటే తనకు చాలా అభిమానం అని పేర్కొంది. ఆమె తన ప్రకటనలో, తెలుగు సినిమాలో నేను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. నాకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చాలా ఇష్టమని, నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని బదులిచ్చాను. ఉదాహరణగా చెప్పాలంటే, పుష్పలోని శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు సరిపోతాయని నేను చెప్పాను..

“అయితే, దురదృష్టవశాత్తు, నా వ్యాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో నటి రష్మిక నటనను తప్పు పట్టినట్లు భావించారు. అలాంటి ఉద్దేశం నాకు అసలు లేదని పేర్కొంది. ఐశ్వర్య వ్యాఖ్యలపై రష్మిక స్పందించింది. మీ భావం నాకు అర్థం అయింది. మీరు ఇలాంటివి పట్టించుకోవద్దు.. మీ పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ చిత్రం ఫర్హానా రిలీజ్ అవనుంది కదా ఆల్ ద బెస్ట్ అని వివాదాన్ని క్లోజ్ చేసింది రష్మిక..!!

Tamannaah Denies Rumors About Special Song In NBK108!

sitha ramam beauty mrunal thakur reveals about her dream role!