in

Tamannaah Denies Rumors About Special Song In NBK108!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్​ రావిపూడితో ఓ మాస్ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో బాలయ్య జోడీగా కాజల్​ అగర్వాల్​ నటిస్తుండగా.. కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ  తమన్నాతో ఓ ఐటెం సాంగ్​ చేయనుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు ఇందుకోసం కోటిన్నర డిమాండ్ చేసినట్టు​ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా తమన్నా స్పందించింది…

ఇందులో భాగంగా ఆమె..తనకు బాలయ్య సర్​, అనిల్​ రావిపూడిపై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. వారి సినిమా కోసం తనను ఒప్పించాల్సిన అవసరం లేదని, ఆ టీంలో పనిచేయడాన్ని తానెంతో ఎంజాయ్​ చేస్తానని తెలిపింది. అయితే, తాను ఐటెం సాంగ్​ చేస్తున్నట్టుగా తప్పుడు వార్తలు రాయడం తనను బాధించిందని తెలిపింది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె మెగాస్టార్ హీరోగా వస్తన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

Keerthy Suresh to marry Dubai-based realtor?

Rashmika reacts To Aishwarya Rajesh’s Srivalli’s controversy!