నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతోంది. పుష్ప, యానిమల్ మూవీ విజయాలతో తనకు ప్రస్తుతానికి తిరుగేలేదని నిరూపించుకుంది. ఇక పుష్ప-2 కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘యానిమల్’ తరువాత రష్మిక తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసిందన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తోందంటూ వార్తలు వెలువడ్డాయి.
సినీ వర్గాల్లో ఈ వార్త పెద్ద చర్చకే దారి తీయడంతో రష్మిక ఎట్టకేలకు స్పందించింది. వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రెమ్యూనరేషన్ పెంచానా? ఇలా అని ఎవరు అంటున్నారో? ఈ వార్తలు చూస్తుంటే నాకూ అలాగే చేయాలనిపిస్తోంది. పారితోషికం ఎందుకు పెంచారని నిర్మాతలు అడిగితే మీడియా అలా అంటోంది సార్ అని సమాధానమిస్తా. వాళ్ల అంచనాలను అందుకోవడం మినహా నేనింక చేసేదేముంది’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది రష్మిక..!!