in

Rashmika about trolls, says ‘it’s heartbreaking and demoralizing’!

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనపై కొందరు విషం చిమ్ముతున్నారని, తనను ద్వేషిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళకు తానొక పంచింగ్ బ్యాగ్ కింద మారినట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని తాను ఆశించడం లేదని, నటిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విమర్శలు వస్తాయనేది తనకు తెలుసని, దాని అర్థం ద్వేషించమని కాదని రష్మిక స్పష్టం చేశారు. ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ప్రతి రోజూ తాను కష్టపడుతున్నాని ఆవిడ వివరించారు..”ముఖ్యంగా నేను చెప్పని విషయాలకు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నన్ను ఎగతాళి చేస్తున్నారు. టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. వాటిని చూసినప్పుడు గుండె బద్దలవుతోంది. నిరుత్సాహానికి గురవుతాం.

కొన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పిన విషయాలు నాకు వ్యతిరేకంగా మారాయి. చిత్రసీమలో, సినిమా ఇండస్ట్రీ బయట నా రిలేషన్షిప్స్‌కు హాని కలిగించే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు” అని రష్మిక పేర్కొన్నారు. తనను మెరుగు పరుచుకునేలా వచ్చే సహేతుకమైన విమర్శలను తాను స్వాగతిస్తానని ఆవిడ తెలిపారు..చాలా రోజులుగా తాను విమర్శలను విస్మరిస్తూ వస్తున్నానని… అయితే రోజు రోజుకూ వరస్ట్ అవుతోందని రష్మిక వివరించారు. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడటం వల్ల ఎవరిపైనా విజయం సాధించేది లేదని ఆవిడ వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమ, అభిమానం ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తోందని ఆవిడ చెప్పారు.

soumya rao entered Jabardasth to compete with Rashmi!

100 Crores More To Be Spent on Improving VFX Of adipurush?