in

soumya rao entered Jabardasth to compete with Rashmi!

జ‌బ‌ర్‌ద‌స్త్ నుంచి అన‌సూయ వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆమె స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలా? అని మ‌ల్లెమాల మ‌ల్ల‌గుల్లాలు ప‌డింది. ర‌క‌ర‌కాల ఆప్ష‌న్లు ప్ర‌య‌త్నించింది. చివ‌రికి ఓ కొత్తందాన్ని తెర‌పైకి తీసుకొచ్చింది. త‌నే సౌమ్యా రావు. క‌న్న‌డ సీమ‌కు చెందిన సౌమ్య‌..తెలుగువారికి ప‌రిచ‌య‌మే. ఈటీవీలో `శ్రీ‌మంతుడు` సీరియ‌ల్ తో పాపుల‌ర్ అయ్యింది. త‌ను న‌టించిన కొన్ని క‌న్న‌డ సీరియ‌ల్స్ తెలుగులో డ‌బ్ అయ్యాయి. ఇటీవ‌ల ఈటీవీలో ప్ర‌ద‌ర్శిత‌మైన ఓ కామెడీ షోలో కూడా తాను క‌నిపించింది. ఆ షో..హిట్ట‌య్యేస‌రికి మ‌ల్లెమ‌లా దృష్టి సౌమ్య రావుపై ప‌డింది.

అందుకే జ‌బ‌ర్‌ద‌స్త్ లో ఆమెను తీసుకోవాల‌ని ఫిక్స‌యిపోయారు..ఈ షో కోసం.. సౌమ్య‌కు ఒకొక్క ఎపిసోడ్ కీ రూ.30 వేల పారితోషికం ఇస్తున్న‌ట్టు స‌మాచారం. ఇది వ‌ర‌కు అన‌సూయ ఒక్కో రోజు షూటింగ్ కి రూ.ల‌క్ష నుంచి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కూ అందుకొంద‌ని స‌మాచారం. ఆమెతో పోలిస్తే.. సౌమ్య కొంచెం చీప్ గా వ‌చ్చేసిన‌ట్టే. ఈ షో తో సౌమ్య పాపుల‌ర్ అయితే… మెల్ల‌మెల్ల‌గా.. త‌న రెమ్యున‌రేష‌న్ కూడా పెరుగుతుంది. సౌమ్య చ‌లాకీ అమ్మాయే. పైగా గ్లామ‌ర్ షో చేయ‌డానికి ఏమాత్రం అభ్యంత‌రం చెప్ప‌దు. సో..జ‌బ‌ర్‌ద‌స్త్ వీక్ష‌కుల‌కు ఇక పండ‌గే..!!

TELUGU AUDIENCE MISSED A GREAT COMBINATION!

Rashmika about trolls, says ‘it’s heartbreaking and demoralizing’!