in

Rashi Khanna not interested in Telugu films anymore?

తెలుగులో సినిమాలు చేస్తూనే రాశి ఖన్నా తమిళ్ లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో చివరిగా థాంక్యూ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. ఈ మధ్యలో హిందీలో వెబ్ సిరీస్ లో నటించారు. డబ్బింగ్ తమిళ్ సినిమాలతో అప్పుడప్పుడు అలరిస్తున్నారు. కానీ రాశి ఒక తెలుగు సినిమా చేసి చాలా కాలం అయ్యింది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత రాశి ఖన్నాకి తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ సినిమా కూడా లేదు.

ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని పక్కా కమర్షియల్ సినిమాలో నటించారు. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన థాంక్యూ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. రాశి ఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫోటో షూట్ చేసి, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలా ఇటీవల కూడా కొన్ని ఫోటోలని షేర్ చేశారు. రాశి ఖన్నా చేతిలో ప్రస్తుతం ఒక హిందీ సినిమాతో పాటు, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. మరి తెలుగులో ఎప్పుడు నటిస్తారో తెలియాలి అంటే వెయిట్ చేసి చూడాల్సిందే..!!

meenakshi chowdhary turns item girl for devara?

trivikram – ram pothineni movie to go on sets soon?