
గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, చిత్రబృందం తనను ఇబ్బందికరమైన డిమాండ్లతో వేధించారని వెల్లడించారు. బ్రా లేకుండా, షర్ట్ బటన్లు విప్పి యాక్షన్ సీన్లో నటించాలని అడిగారని తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్ చిత్రీకరణకు రెండు రోజుల ముందు దర్శకుడు, ఆయన బృందం తన దగ్గరకు వచ్చారని రాధికా ఆప్టే చెప్పారు. బ్రా లేకుండా కేవలం షర్ట్ వేసుకుని, బటన్లు విప్పి ఫైట్ సీన్ చేయగలరా? అని నేరుగా అడిగారని వెల్లడించారు..వారి మాటలు విని ఆశ్చర్యపోయానని..
యాక్షన్ సీన్లో శరీరం కదిలినప్పుడు షర్ట్ పక్కకు జరిగే అవకాశం ఉంటుందని, కనీస లాజిక్ ఆలోచించరా? అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిపారు. దానికి వారు మరో అడుగు ముందుకేసి కేవలం బ్రా, అండర్వేర్తోనే ఆ సన్నివేశం చేయవచ్చుకదా అని అడిగారని చెప్పారు. అసలు తనతో ఏం చేయించాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వివరించారు. సినిమా కథ చెప్పినప్పుడు, ఒప్పందం చేసుకున్నప్పుడు ఇలాంటి సన్నివేశాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రాధికా పేర్కొన్నారు. ఒకవేళ నగ్నత్వం లేదా శరీర ప్రదర్శనకు సంబంధించిన సన్నివేశాలు అవసరమైతే ముందుగానే స్పష్టంగా చెప్పాలని అభిప్రాయపడ్డారు..!!
