అక్కినేని నాగేశ్వర రావు గారు, హేతువాది, ఆయన ముహుర్తాలు పూజలు వంటి వాటికీ కొంచెం దూరంగా ఉండే వారు. కానీ అక్కినేని వారి చేత ఒక సినిమా ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టించారు రామ నాయుడు గారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతిష్టను పెంచిన చిత్రం “ప్రేమ నగర్” . ఆ చిత్రం ముహూర్తం షాట్ కి నటి నటులందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు, కానీ అక్కినేని దూరంగా ఉన్నారట,
రామానాయుడు గారు అక్కినేని గారిని కొబ్బరికాయ కొట్టమనగానే, నాకు అలవాటులేదు మీరు కానివ్వండి అన్నారట. కానీ రామానాయుడు గారు మాత్రం, నా కోసం మీరు కొబ్బరికాయ కొట్ట వలసిందే అని పట్టు పట్టేసరికి, నాయుడు గారి మనసు నొప్పించటం ఇష్టం లేక కొబ్బరికాయ కొట్టారట, అక్కినేని గారు ఆ ఆనవాయితీ ని తరువాత కూడా కొనసాగించటం విశేషం. మన నమ్మకాల కోసం ఇతరులను నొప్పించటం ఎందుకు అనుకోవటం కావచ్చు..