in

Ram Charan tests positive for Covid-19!

రోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ తన పంజా విసురుతూ వెళ్తోంది. గతకొన్ని నెలలుగా యావత్ ప్రపంచం ఈ వైరస్ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కాగా ఈ వైరస్ సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా ప్రముఖ తెలుగు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వైరస్ బారిన పడ్డారు.

రామ్ చరణ్ తనకు కరోనా సోకిందనే విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, గత రెండు రోజులుగా తన చుట్టూ ఉన్నవారు తప్పకుండా పరీక్ష చేయించుకోవాల్సిందిగా రామ్ చరణ్ కోరారు. తనకు కరోనా పాజిటివ్ అని రావడంతో తన కుటుంబ సభ్యులకు దూరంగా హోమ్ క్వారంటైన్ ఉంటున్నానని, తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళనకు గురికావద్దని చరణ్ ఈ సందర్భంగా కోరారు.

a crazy update on nagarjuna’s ‘bangarraju’!

rashmika mandhanna to play Amitabh Bachchan’s daughter role!