in

rashmika mandhanna to play Amitabh Bachchan’s daughter role!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మూవీలో నటించనుంది హీరోయిన్ రష్మిక మందన్న.  పిరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌ ‘మిషన్‌ మజ్ను’ ద్వారా  రష్మిక మందన్న బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతుంది. సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ఫిబ్రవరిలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇదిలావుండగా రష్మిక మందన్న హిందీలో మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది.

బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నమూవీలో ఓ ముఖ్య పాత్రలో ఆమె నటించబోతున్నది.  ఈ చిత్రానికి వికాస్‌భల్‌ దర్శకత్వం వహిస్తారు. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. ఇందులో అమితాబ్‌ కూతురి పాత్రలో రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Ram Charan tests positive for Covid-19!

thana jeevitha kathalo thaane natinchina MAYURI SUDHA CHANDRAN!