ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ రీసెంట్ గా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక కరోనా నుండి బయటపడడమే ఆలస్యం వరుస సినిమా షూటింగ్ లతో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు బిజీ గా మారింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రా తో.. ఈ సినిమా లో సిద్దార్థ్ తో పాటు అజయ్ దేవగన్ మరొక హీరోగా కనిపించనున్నారు. టీసిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘థాంక్ గాడ్’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఇంద్ర కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే రకుల్.. అజయ్ దేవ్ గన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న’మేడే’ సినిమాలోనూ నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లలో రకుల్ పాల్గొంటోంది.