in

National crush Rashmika Mandanna buys new range rover car!

టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారారు రష్మిక మందన్నా. వరుస ఆఫర్లతో హిట్ల మీద హిట్లు కొడుతున్న ఈ అమ్మడు తాజాగా రేంజ్‌ రోవర్‌ కారు కొన్నారు. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయారు. ‘సాధారణంగా ఇలాంటి విషయాలను నేను ఎవరితోనూ పెద్దగా పంచుకోను. కానీ ఈ సారి మాత్రం చెప్పకుండా ఉండబట్టలేకపోతున్నా. ఎందుకంటే నా ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యులే.

ఇలాంటి ఓ రోజు వస్తుందని నేనస్సలు ఊహించలేదు. ఇంకా నేను ఎయిర్‌పోర్టుకు పరుగెత్తుతున్న సమయంలో ఓ రెండు నిమిషాలు ఆగి మరీ కారు దగ్గర ఫొటోలు దిగాను. మనం ఎంతదూరం వచ్చామో మీకు చూపించాలి కదా! నా మీద ప్రేమ కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అంటూ కారు ముందు నిలబడి స్టిల్స్‌ ఇచ్చిన ఫొటోను షేర్‌ చేశారు.. ఇంతకీ ఈ కారు విలువ ఎంత ఉంటుందనుకుంటున్నారు? రూ. కోటి రూపాయల పైనే..

Radhe Shyam director makes a promise to Prabhas fans!

rakul preet singh bags 2 more Bollywood biggies!