in

Rakul Preet Reveals She Was taken out from prabhas movie!

ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. ”ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో షెడ్యూల్‌ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్‌ కోసం ఎన్ని రోజులైనా ఫోన్‌ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది..

నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి తొలగించేశారు. అప్పటికే ప్రభాస్‌- కాజల్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో మరోసారి ఆ జోడి రిపీట్‌ అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం నన్ను తొలగించి తనను తీసుకుంది. సినిమా అనేది ఓ వ్యాపారం..ఇందులో కొత్తగా పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలకు ఇలా జరగడం సహజమే. నాకు ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఒక అవకాశం పోయినా..దానికి మించింది మన కోసం ఎదురు చూస్తుంటుం దని నేను భావిస్తా” అని రకుల్‌ చెప్పారు..!!

Producer Naga Vamsi provides clarity on Devara collections!

kriti shetty to romance ram charan?