కొద్ది రోజులుగా సినిమా షూటింగ్స్ లేక చిర్రెత్తుకొస్తున్న రకుల్‌కి ఓ మీడియా చేసిన ట్వీట్ కోపం నశానికి ఎక్కేలా చేసింది. వివరాలలోకి వెళితే కరోనా వలన రకుల్ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు నో చెప్పిందని, దీంతో ఆమెని తొలగించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని మీడియా రాసుకొచ్చింది. దీనిపై మండి పడ్డ రకుల్.. బాధ్యత యుతమైన జర్నలిజం ఎప్పుడు వస్తుంది, మీడియా నిజాలను తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది, కొన్ని హిట్స్ కోసం మరీ దిగజారిపోతున్నారు.
అసలు ఎవరు ఎక్కడ షూటింగ్స్ జరుపుతున్నారో నాకు చెప్పండి. ఇక్కడ పనిలేక చచ్చిపోతున్నాం” అని పోస్ట్ చేశారు. రకుల్ ఇచ్చిన సమాధానంతో సదరు మీడియా సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం రకుల్ మందుల షాప్‌కి వెళ్ళగా, కొందరు వైన్ షాప్‌కి వెళ్ళినట్టు ప్రచారం చేశారు. దీనిపై రకుల్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చి పుకార్లకి చెక్‌పెట్టిన విషయం తెలిసిందే.