in

Producer Loss 7 Crore Rupees Due To Payal Rajput!

RDX లవ్’ సినిమా మొదటి ట్రైలర్ సోషల్ మీడియాలో సెగలు రేపింది. అయితే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. దాంతో నిర్మాత సి. కళ్యాణ్ దగ్గర ‘ఈ ట్రైలర్ కారణంగా తన ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందం’టూ పాయల్ మొరపెట్టుకుందట. ఆమె మాటను గౌరవిస్తూ, సినిమాలోని పాయల్ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ, సెకండ్‌ ట్రైలర్ ను విడుదల చేశారు సి. కళ్యాణ్.

లేడీ అమితాబ్ విజయశాంతి తరహాలో పాయల్ రాజ్ పుత్ కనిపించే ఈ ట్రైలర్ చూసిన కుర్రాళ్లు పెదవి విరిచారట. విజయశాంతి స్థాయిలో పాయల్ ను తెర మీద చూడటం ఇష్టంలేని వాళ్ళెవరూ థియేటర్లకు రాలేదు. దాంతో ఓపెనింగ్స్ కరువయ్యాయి. మంచి పాత్ర చేసినా… పాయల్ కు రావాల్సిన గుర్తింపు దక్కలేదు. తాను చేసిన చిన్న తప్పువల్ల నిర్మాతగా ఏడు కోట్ల రూపాయలు నష్టపోయానని సి. కళ్యాణ్ తెలిపారు.

Alia Bhatt Special Gift To Sitara!

Kajal Agarwal enjoyed her honeymoon free of cost!