రూకోటి పారితోషకం అనే అడ్డంకిని తొలగించిన ఈ ముద్దుగుమ్మ..తన చేతుల మీదుగా బాలీటౌన్ లో నటీమణుల పారితోషకం పెంచే ప్రక్రియ ప్రారంభమైంది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా ఈమె విజయవంతంగా పనిచేసి.. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. నివేదిక ప్రకారం దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు రూ.40కోట్లు అందుకుంటుంది.. అయితే ఈ సంఖ్య హాలీవుడ్ కి సంబంధించింది. రూ.40 కోట్లు అంటే అక్కడ 5 మిలియన్ డాలర్లు. ఇటీవల ఈమె నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ .40 కోట్లు పారితోషకం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది..!!