ప్రస్తుతం తెలుగులో ఢీ షో తో జడ్జిగా వ్యవహరిస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ’నవ వసంత’ సినిమాలో తరుణ్ తో ప్రియమణి నటించిన విషయం తేలిసిందే. అప్పట్లో యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నా తరుణ్ లవ్ ఎఫైర్స్ పై వార్తలు బాగానే వచ్చేవి. అప్పట్లో తరుణ్-ప్రియమణిల ఎఫైర్.. వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు.. పెళ్లి కూడా ఫిక్సయ్యిందంటు… లగ్జరీ కారు కూడా గొప్ట్ గా ఇచ్చారట అంటు వార్తలు కూడా వచ్చాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి స్పందిస్తు… తరుణ్ తల్లి రోజారమణి షూటింగ్ కి వచ్చి మరి ఇద్దరూ ప్రేమించుకుంటే చెప్పమని.. పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అడిగిన విషయం చేప్పుకొస్తూ… రోజారమణి వచ్చి తనను అడిగేవరకు అసలు తరుణ్ కి తనకు సంబంధించిన వార్త వచ్చిందనే విషయం కూడా తెలియదని…. ఆ సమయంలో తనకు నవ్వొచ్చిందని.. వెంటనే అమ్మానాన్నకు ఫోన్ చేసి చెప్పి నవ్వుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రియమణి ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.