కె రాఘవేంద్ర రావు గారి సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం పై సుశాంత్, చాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి ముఖ్య తారాగణం తో రాఘవేంద్ర వర్మ దర్శకత్వం లో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మిస్తున్న రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “బొంబాట్”. ఈ చిత్రం డిసెంబర్ 3 వ తారికున్న అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యేకంగా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా
దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ “సరికొత్త కథ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వస్తున్నా చిత్రం “బొంబాట్”. నా కథను నిమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ గారికి ధన్యవాదాలు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు మా సినిమా స్క్రిప్ట్ దశ నుంచి మాతో ఉంది మమ్మల్ని వెనకుండి నడిపించారు. అయన సినిమా చూసి చాలా బాగుంది అని సూపర్ హిట్ అవుతుంది అని కొనియాడారు.