in

Priya Earnings From Bigg Boss Telugu 5!

బిగ్‌బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు పుల్ మీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ చేస్తూ ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. 19మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైనా ఈ షోలో ఇప్ప‌టి వ‌రకూ.. వారానికి ఒక్కోక్క‌రూ చొప్పున ఏడుగురు కంటెస్టెంట్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఏడో ఎలిమినేష‌న్లో సీనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రియ కూడా హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియ ఎట్టకేలకు ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో న‌టించే ప్రియ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న వారానికి ఎంత తీసుకుంది? ఏడు వారాల్లో ఎన్ని లక్షలు పోగు చేసింది?

ఆమె అకౌంట్లో ఎంత ఆమౌంట్ వేసి ఉంటార‌నే ఆరా తీస్తున్నారు బిగ్ బాస్ ఫాలోవ‌ర్స్. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్రియ‌కు ఒక్క వారానికే 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు పది లక్షల పైనే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఆమె చేసిన ఎంట‌ర్ టైన్ మెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెతో చేసుకున్న డీల్ కంటే.. ఎక్కువ మొత్తంలోనే ఇచ్చే ఆస్కారం ఉన్న‌ట్టు భావిస్తున్నారు నెటిజ‌న్లు.

ONLY SUCCESS SPEAKS!

ROMANTIC!