in

Prashanth Neel Reveals How Jr NTR Lost 15 Kg In 4 Months!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 15 కేజీల బరువు తగ్గి సరికొత్త మేకోవర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ పడిన శ్రమను, ఆయన అంకితభావాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొనియాడారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..సినిమాలోని ‘లూగర్’ పాత్ర కోసం ఎన్టీఆర్ కొద్దిగా బరువు తగ్గితే బాగుంటుందని తాను ఒక చిన్న సలహా మాత్రమే ఇచ్చానని వెల్లడించారు. అయితే ఆ సూచనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, కేవలం కొద్ది కాలంలోనే ఏకంగా 15 కేజీల బరువు తగ్గి కఠినమైన శారీరక మార్పును సాధించారని చెప్పారు. పాత్ర పట్ల ఆయన చూపించిన ఈ అంకితభావం చూసి తాను షాక్ అయ్యానని, తారక్ ఈ క్యారెక్టర్ కోసం పూర్తిగా లీనమైపోయారని ప్రశాంత్ నీల్ ప్రశంసల వర్షం కురిపించారు..!!

Keerthy Suresh opened up about losing 10 kg in 9 months!