సీనియర్ నటి కుట్టి పద్మిని, బాల నటిగా ఎన్నో చిత్రాలు నటించారు. లేత మనసులు చిత్రం తో చాల పాపులర్ అయ్యారు. మన ప్రధాని ఇందిరా గాంధీ గారిని కొంగుపట్టి నిలదీసి మరి అవార్డు తీసుకున్న ఘటికురాలు బేబీ పద్మిని. నేషనల్ అవార్డు ఫంక్షన్ కి వెళ్లిన కుట్టి పద్మిని కి అవార్డు ఇవ్వకూండానే వెళ్ళిపోతున్న ఇందిరా గాంధీ గారిని కొంగుపట్టి ఆపి,నాకు ఎందుకు అవార్డు ఇవ్వలేదు, మీ డాడీ నెహ్రూ గారు అయితే నాకు తప్పక అవార్డు ఇచ్చేవారు ఆయనకు చిన్న పిల్లలు అంటే చాల ఇష్టం,
అని అడగగానే, ఆశ్చర్యపోయిన ఆమె, అవార్డు కమిటీ సభ్యులను, కుట్టి పద్మిని నటించిన లేతమనసులు సినిమా ప్రింట్ తనకు పంపమని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజు తన నివాసం లో విందుకు వచ్చిన అవార్డు గ్రహీతలను పలకరించిన ఇందిరా గారు, కుట్టి పద్మినిని పిలిచి చెక్కిలి మీద ఒక ముద్దు పెట్టి, అక్కడనే ఆమెకు ఉత్తమ బాల నటి అవార్డు ను అందచేశారు. నువ్వు చాల బాగా నటించావు, ఫ్యూచర్ లో నువ్వు చాల మంచి నటివి అవుతావు అని చెప్పారట. ఇందిరా గాంధీ గారు ఇచ్చిన అవార్డు కంటే ఆమె తనకు పెట్టిన ముద్దే పెద్ద అవార్డు అంటారు కుట్టి పద్మిని గారు..