in

prabhas to romance master beauty malavika mohanan!

యంగ్ హీరోయిన్ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ తానూ గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమే అనే సంకేతాలు దర్శకనిర్మాతలు ఇస్తుంది. రీసెంట్ గ మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించింది . 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మాళవిక మోహన్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాలో ఈ అమ్మడు కీలక పాత్రలో నటించింది. మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది.

లేటెస్ట్ గా ట్రెండీ డ్రెస్ లో క్లివేజ్ షోతో రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో మాళవిక గ్లామర్ షో కు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. మంచి అవకాశం వస్తే నటిగా, గ్లామర్ పరంగా నిరూపించుకోవాలని మాళవిక భావిస్తోంది.మాళవిక బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. మాళవిక మోహన్ మాస్టర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. అయితే ఇపుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జోడీ కట్టే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. మారుతీ ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మాళవిక ను హీరోయిన్ గా తీసుకోవాలి అని భావిస్తున్నారట.

పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మారుతీ ప్రస్తుతం నటీనటులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాడట. మారుతి తన సత్తాను నిరూపించుకోవడానికి కొన్నాళ్లుగా వెతుకుతున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఈ సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకుని స్టార్ డైరెక్టర్ గా మారిపోవాలని చూస్తున్నాడు. మరి చూడాలి మారుతీ ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడో..

WHO IS BEHIND SHANKARA SHASTRY ?

valentines day special, anchor sreemukhi says she is in love!