ఆది పురుష’ ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. దాని కోసం కొన్ని నెలల పాటు ప్రభాస్ ముంబయిలో ఉండాల్సి వస్తుంది. ప్రభాస్ చేస్తున్న, చేయబోయే సినిమాలకు కూడా పాన్ ఇండియా అప్పీల్ రావడం కోసం ముంబయిలో చిత్రీకరణ జరిపే అవకాశముంది. తరచుగా అతను బాలీవుడ్ సినీ స్థావరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ముంబయిలో ఓ భారీ ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్‌తో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నాడట. ప్రభాస్‌కు ఇల్లు చూసే బాధ్యత ఆయనే తీసుకున్నాడట. ఎలాగూ ఒక పెట్టుబడిగా కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ప్రభాస్ చూస్తున్నట్లు సమాచారం. పదుల కోట్ల మొత్తంలోనే ఇందుకోసం పెట్టుబడి పెడుతున్నాడట. బహుశా ఆదిపురుష్ సినిమాకు వచ్చే పారితోషకమంతా ఇంటి మీదే పెట్టేస్తున్నాడేమో ప్రభాస్.