మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకు కిలాడీ అనే పేరు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా తమన్నాను తీసుకోవాలనుకుంటే ఆమె చెప్పిన రేటుతో షాక్ అయిన నిర్మాతలు ఆ ఫేడవుడ్ భామకు అంత ఇవ్వడం కంటే సినిమాకు క్రేజ్ రావాలంటే పూజ హెగ్డే అయితే బెటర్ అని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం పూజ వరుస పెట్టి స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రవితేజ సినిమాకు ఆమె నో చెప్పేసిందట. ప్రస్తుతం రవితేజ టైం బాగోలేదు.
అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకు అన్ని ప్లాపులే. అసలు ఇప్పుడు రవితేజ సినిమా వస్తుందన్నా కొనేవారే లేరు. రవితేజ హిట్ కోసం పరితపించేస్తున్నాడు. ఈ క్రమంలోనే కిలాడి సినిమా కోసం పూజా హెగ్డేను అడిగినా ఆమె మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేసిందన్న ప్రచారం జరుగుతోందట. పూజా తప్పుకోవడంతో ఇప్పుడు సినిమా మేకర్స్ రకుల్ప్రీత్ను అప్రోచ్ అయ్యే పనిలో ఉన్నారట..