in

pooja hegde realizes her mistake!

ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్, చిరంజీవి – రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య, తమిళ్ లో విజయ్ తో బీస్ట్, హిందీలో సల్మాన్ ఖాన్ తో నటించిన చిత్రాలు వరుసగా విడుదలై ప్లాప్ కావడంతో పూజా హెగ్డే కు కష్టాలు మొదలయ్యాయి..దీంతో నిర్మాతలు ఆమె వంక చూడాలంటేనే భయపడుతున్నారు. అయితే కెరీర్ పిక్స్ లో ఉండి వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొన్ని నెలల పాటు రెండు పరిశ్రమలని బాగానే బ్యాలెన్స్ చేసింది.

కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. ఫలితంగా రెంటికి చెడ్డ రేవడిలా సన్నివేశం కనిపిస్తుంది. ఇటీవల మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ దానిని వదులుకుంది. ఇంత పెద్ద అవకాశం ఇలా ఏలా వదులుకుందని టాలీవుడ్ లో పెద్ద చర్చ సాగింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో పలు సినిమాలను వదులుకొని ఈ బుట్టబొమ్మ తప్పు చేశానని ఫీల్ అవుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల నుంచి సమాచారం..!!

Extra Ordinary Man!

hattrick of flops for happening beauty sreeleela!