రామ్ చరణ్ సరసన ‘ఆచార్య’ స్క్రీన్ మీద ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలే ఉండనుంది. అయితే సమయంతో సంబంధం లేకుండా 20 నిమిషాల పాత్ర కోసం పూజా కోటి రూపాయలు తీసుకోబోతుందటా. వినడానికి కొంచెం ఆశ్యర్యంగానే ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ భామకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇక ఆచార్యలో అందరూ బడా స్టార్స్ నటిస్తుండటంతో తను కూడా భారీగానే రెమ్యూనరేషనర్ తీసుకోవాలని పూజా భావించి కోటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందుకు చిత్ర యూనిట్ కూడా సుముఖంగానే ఉండటంతో అక్షరాల కోటి రూపాయలకు ఆమెకు సమర్పించుకోనున్నారు. మరి అంత మొత్తంలో అందుకున్న పూజా క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆచార్య విడుదలయయ్యే వరకు వేచి చూడాలి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మే 7 విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది..