in

Pooja Hegde Asked To Share A Naked Picture By A ‘Fan’!

తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సైలెంట్ కౌంటర్ ఇచ్చింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో చాట్ చేస్తున్న సందర్భంగా పూజా హెగ్డేను ఓ అభిమాని తన నగ్న చిత్రాన్ని పెట్టాలంటూ కామెంట్ చేశాడు. దీనికి చాలా తెలివిగా స్పందించిన పూజా హెగ్డే.. తన పాదాలను ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఇది చూసి సదరు అభిమాని కంగుతిన్నాడు.

కాగా, ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. మరోవైపు పూజా హెగ్డే సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫోటో కోరిన నెటిజన్‌‌కు సైలెంట్‌గా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందంటూ కితాబిస్తున్నారు. కాగా, ఈ ఫోటోకి ముందు పూజ మరొకిన్ని ఫోటోలను కూడా తన అభిమానులతో పంచుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో ఉన్న ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటో, మేకప్ లేకుండా ఉన్న ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను అమ్మడు తన అభిమానులతో పంచుకుంది.

sri Lankan beauty Jaqueline Fernandez in pawan – krish movie?

Keerthy Suresh in Forbes 30 Under 30!