in

sri Lankan beauty Jaqueline Fernandez in pawan – krish movie?

క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. అయితే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. ఒక హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్‌ ను ఎంపిక చేసిన‌ట్టు మూవీ టీం ప్ర‌క‌టించింది. మ‌రో హీరోయిన్ గా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఫైన‌ల్ చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్న‌ట్టు సమాచారం.

డైరెక్ట‌ర్ క్రిష్ కు బాలీవుడ్ తో మంచి కాంటాక్ట్స్ ఉండ‌టంతో జాక్వెలిన్ ను కీల‌క పాత్ర కోసం డేట్స్ సర్దుబాటు చేసే ప‌నిలో ఉన్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటించిన వకీల్‌ సాబ్‌ ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక పవన్‌ కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’కు ఇది రీమేక్‌..

Check Movie Trailer, Nithiin, Rakul Preet, Priya Varrier!

Pooja Hegde Asked To Share A Naked Picture By A ‘Fan’!