in

Pooja Hegde and Rohan Mehra added fuel to their dating rumors!

పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ తన ప్రియుడితో రొమాన్స్ లో మునిగితేలుతున్నట్లు సమాచారం. అయితే ఈమె ఎవరితో ప్రేమలో పడింది అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. అతను ఎవరో కాదు హిందీ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్, సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రా తో ఈమె డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

గత కొన్నాళ్లుగా పూజా హెగ్డే రోహన్ మెహ్రాతో చట్టపట్టలేసుకొని మీడియా కంట పడుతోంది. ఈ క్రమంలోని బుధవారం పూజ హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్ కి రాగా అక్కడ పూజాహెగ్డే ఫ్యామిలీతో పాటు రోహన్ మెహ్రా కూడా రెస్టారెంట్లో దర్శనమిచ్చారు. అంతేకాదు పూజా హెగ్డే ఫ్యామిలీతో కలిసి ఈయన ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం. మొత్తానికైతే ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయ..!!

Paarijatha Parvam!

sai dharam tej to marry her favorite heroine?