in

official: Rakul Preet And Jackky Bhagnani to get married on Feb 21

నెల 21న గోవాలో వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. తొలుత‌ విదేశాల్లో వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకొన్నా, చివ‌రి నిమిషంలో గోవాకి ఫిక్స‌య్యారు. గోవాని ఎంపిక చేసుకోవ‌డానికి కూడా ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. ర‌కుల్, జాకీల ప‌రిచ‌యం గోవాలోనే జ‌రిగింది. అందుకే సెంటిమెంట్ ప‌రంగా గోవాలోనే పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.

అయితే ఈ శుభ‌కార్యానికి చిత్ర‌సీమ‌కు చెందిన‌ సెల‌బ్రెటీల్ని ఆహ్వానించ‌డం లేద‌ని తెలిసింది. టాలీవుడ్, కోలీవుడ్ లోని టాప్ స్టార్లందరితోనూ ర‌కుల్ న‌టించింది. త‌న పెళ్లికి స్టార్ హంగామానే కావాల‌నుకొంటే, ర‌కుల్ వాళ్లంద‌రినీ ఆహ్వానించి ఉండొచ్చు. కానీ, ఈ హ‌డావుడేం వ‌ద్ద‌నుకొంటోంది.పెళ్లికి కూడా పెద్ద‌గా హ‌డావుడి చేయ‌డం లేదు..పెళ్లి త‌ర‌వాత కొన్ని రోజులు విదేశాల్లో గ‌డిపి, ఆ త‌ర‌వాత మ‌ళ్లీ షూటింగ్స్ కు రానుంది..!!

prabhas doesn’t want to act with priyanka chopra?

tollywood heroine Rukmini Vasanth gets a pan india movie!