in

Ameesha Patel on dating rumours with Hardik Pandya!

ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై సీనియర్ నటి అమీషా పటేల్ తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. ముంబైలో ఇటీవల ఒక వేడుక జరిగింది. ఆ కార్యక్రమంలో హార్దిక్ భుజంపై అమీషా చేయి వేసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన ఒక నెటిజన్ వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

ఆ పోస్ట్‌ను చూసి తీవ్ర అసహనానికి గురైన అమీషా పటేల్ దానికి గట్టిగా రిప్లై ఇచ్చారు. నీకు నిజ జీవితంలో గర్ల్‌ఫ్రెండ్ లేదని స్పష్టంగా అర్థమవుతోందని ఆ నెటిజన్‌ను ఉద్దేశించి ఆమె ఘాటుగా బదులిచ్చారు. అందుకే ఒక అమ్మాయి సాధారణంగా పలకరించినా నువ్వు అందులో తప్పులు వెతుకుతున్నావు అంటూ మండిపడ్డారు. పలకరించే సమయంలో ఆప్యాయంగా చేయి వేసినా కూడా దాన్ని లవ్, డేటింగ్ అంటూ వక్రీకరిస్తారా అని ప్రశ్నించారు. ముందు నువ్వు సరిగ్గా బతకడం నేర్చుకో, ఒక గర్ల్‌ఫ్రెండ్‌ని వెతుక్కో, ఆ తర్వాత ఇలాంటి పనికిమాలిన ఊహాగానాలు ప్రచారం చేయవచ్చు అంటూ కౌంటర్ ఇచ్చారు..!!

Nandamuri Mokshagna to romance sreeleela in his debut film!