in

ntr to play nri role in his next?

ల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించినప్పటికీ..ప్రస్తుతం కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉండడంతో ఎన్టీఆర్ కాస్త వెనకడుగు వేస్తున్నాడట.

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ త్రివిక్రమ్ అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటె ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్నారై గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం.

samantha out aishwarya in!

thamanna in ‘andhadhun’ telugu remake!