in

not Gopichand, akhanda team wants a Chinese villain!

ఖండ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు బోయపాటి. ‘అఖండ 2 ‘ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందని, బాబీతో సినిమా పూర్తి చేసి బాలయ్య ఈ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. ఇప్పడు ‘అఖండ 2 ‘ కోసం నటీ నటులు కావాలని టీమ్ ప్రకటన ఇచ్చింది. మొన్నటివరకు గోపి చంద్ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరిగింది కానీ ఇప్పడు చైనా విలన్ కావాలని టీమ్ కోరింది.

మెయిన్ విలన్ పాత్ర కోసం కుదిరితే  చైనీస్ యాక్టర్ లేదా నార్త్-ఈస్ట్ నటులను తీసుకోవాలని బోయపాటి అనుకుంటున్నారట. హీరోతో పాటు విలన్ కి కూడా యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉండటంతో మంచి నటుడ్ని ఎంపిక చేసే పనిలో వున్నారట. విలన్ ఏజ్ 50 నుంచి 55 ఏళ్ళు ఉండాలని ‘ఆడిషన్ ఇండియా ఇన్ స్టా పేజి’ ద్వారా యాడ్ ఇచ్చారు. విలన్ తో పాటు ఇంకో రోల్ కోసం16 నుంచి 18 ఏళ్ళ ఫీమేల్ యాక్టర్ కూడా కావాలని ప్రకటన ఇచ్చారు. ఏ భాషకి చెందిన అమ్మాయి అయినా యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలని పేర్కొన్నారు..!!

Pooja Hegde in Raghava Lawrence’s Kanchana 4?

Regina Cassandra: I Have Had Many Boyfriends, I’m a Serial Dater